Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

JOLALI JOLALI JOLAI SONG BY KSR @ RAYUDU MOVIE


JOLALI JOLALI JOLALI  . . . .

       


Film:  Rayudu

Music: S.A. Raj Kumar

Lyrics: Suddala Ashok Teja

Singer: K.J. YESUDAS

Director: Ravi Raja Pinisetty

👇👇👇👇

జోలాలి జోలాలి జోలాలి 

జోల పాడుతా  బజ్జో నా తల్లి 

జోలాలి జోలాలి జోలాలి 

జోల పాడుతా  బజ్జో నా తల్లి 

నిదుర తల్లినీ బతిమలాడని

నీలి కళ్లలో నిదుర పొమ్మని 

రా రమ్మని ఇమ్మని తీపి కలలు ఎన్నో 

రా రమ్మని ఇమ్మని తీపి కలలు ఎన్నో 

జోలాలి జోలాలి జోలాలి 

జోల పాడుతా  బజ్జో నా తల్లీ


మీ అమ్మ తీయని గురుతుగ 

ఇచ్చిన కనుక నీవమ్మా 

ఈ పేద హృదయంలోనా 

ఊపిరివే అమ్మ 

నా కున్న వెలుగుల మేడ 

చలువల నీడ నీవమ్మా 

నా మనసే మెత్తగా పరిచా 

పడుకోవే అమ్మ 

అలుపు సొలుపు మాయం చేసే 

చల్లని తల్లీ ఎవరమ్మా 

రాజు పేద తేడా లేక 

ఒడినే చేర్చే నిదురమ్మా

ఊహలలోని లోకంలో 

ఊయలవంటి కునుకులలో 

నువ్వు హాయిగా తీయగా 

ఆలా తేలిపోమ్మా


జోలాలి జోలాలి జోలాలి 

జోల పాడుతా  బజ్జో నా తల్లి 


ఆ తల్లీ కడుపునా నీవు 

తొమ్మిది నెలలే వున్నావు 

ఈ రాయుడి గుండెల్లోనా ఎపుడూ ఉంటావు 

ఓ తల్లీ నీ కేరింతలు 

ఎన్నడు నా ఎద కదిపాయో

బతుకంటే ఎంతటి తీపో

అపుడే తెలిసింది 

రోజు నువ్వు నవ్వుతు ఉంటే 

అన్నంతో పని లేదమ్మా 

ఒక్క పూట అలిగా వంటి 

ఆకలి నాకు కాదమ్మా 

అందరికేమో రాజునురా 

నీ దరి నేను బంటునురా

మీ నాన్నని బిడ్డని నేనేలే తల్లి 


జోలాలి జోలాలి జోలాలి 

జోల పాడుతా  బజ్జో నా తల్లి 



Post a Comment

0 Comments