Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఏంటో ఈ ప్రేమికులు.... ఎప్పటికీ అర్థం కారు ? || POETRY ON LOVE || KSR CREATIVES

 నీతో.. 

పరిచయం..అయినప్పటి నుండి... అదేంటో...

పప్పు లో.. ఉప్పు తక్కువైనా.... 

పెద్ద తప్పుగా కనబడడం లేదు...


కాఫీ లో... చెక్కర తక్కువై

కషాయం లాగా వున్నా...

కోపం నషాళానికి 

ఎక్కట్లేదు....


ఫోన్ లో....ఛార్జింగ్ తక్కువైతే... 

చెస్ట్ పెయిన్ వచ్చేస్తోంది...

మొబైల్ బాలన్స్ అయిపోతే.... 

బీపీ పెరిగి పోతోంది...

అన్లిమిటెడ్.... ఫాస్ట్ స్పీడ్ డేటా.... 

అవిరైపోతోంది....


అద్దం ముందు...

కొత్త డ్రెస్ వేసుకొని...

నిలుచున్నా.. ఇంకా..

పాత డ్రెస్ లానే... కనిపిస్తోంది....


ఈ బైక్ లు.. కార్లు కాదని...

బుల్లెట్ ట్రైన్ లో...

ఎపుడెపుడు... నీ ముందు...

వాలిపోదామా...

ఉహాలోకాల్లో... తెలిపోదామా అనివుంది....


ఎంటీ...

ఎవరి గురించి...

ఇంత బిల్డప్... 

అనుకుంటున్నారా....


అదేనండీ....

ప్రేమ ... ఇష్క్.. కాదల్....

లవ్ గురుంచి....చెప్తున్నా...


ఒక్కసారి...

ప్రేమలో పడ్డాక....

ఈ దెబ్బలన్నీ... 

మాములే కదా...

పెళ్ళైతే కానీ...

మళ్ళీ మన లోకంలోకి రారు...

ఏంటో 

ఈ ప్రేమికులు....

ఎప్పటికీ అర్థం కారు ?


@ KSR CREATIVES

Post a Comment

0 Comments