Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

మా ఇంటి చుట్టూ మొక్కలు పెట్టి .. . | POETRY ON WISHES | KSR CREATIVES


తాగి పడేసిన 

బీరు బాటిల్లో 

వాడి పడేసిన విత్తనం వేసి . . . 

దానికి నారు పోసి  . . .

కావాల్సినంత నీరు పోసి ..  

దానికి ఆ పక్క ఈ పక్క   

డెకొరేషన్ చేసి  . . .

ఎంచక్కా పెయింటింగ్ వేసి .. . 

ఆ బాటిల్ కి అందాన్ని పెంచి  .  .

ఒక మొక్క కు ప్రాణం పోస్తుంది 

మా అక్క  . . 

  

ఆస్తమా ఒక పక్క . . 

నడుము నొప్పి ఇంకో పక్క . . .

అయినా అవేమి పట్టించుకోకుండా . . 

అస్తమానము  . . 

మొక్క ల మధ్యలోనే .. . 

వాటికి మట్టి మారుస్తూ . . 

ఎరువు వేస్తూ . . . 

నీరు పోసుకుంటూ . . 

నొప్పులన్ని మరిచిపోతుంది .. .

చిత్రంగా . . .మరీ విచిత్రంగా . . 

ఏంటో మా అక్క?


 

  

ఆలా ఒక మొక్కతో  . 

మొదలు పెట్టి . . .

మా ఇంటి చుట్టూ మొక్కలు పెట్టి  .. . 

వాటి చుట్టూ ముగ్గులు గీసి . . .

ఆశ తీరక . . 

మాపక్కింటి . . 

వాళ్ళ ఇంటి చుట్టూ కూడా. . 

మొక్కలు పెంచింది . . మా అక్క . .. 


   

మా ఇంటి ముందు .. . .

సాయి బాబా గుడి . .

చాలా ఫేమస్ . . .

ఆ దేవుడి దర్శనం కోసం .. . 

వచ్చేవాళ్ళు 

ఒక చిన్న లుక్కేస్తారు . . 

మా ఇంటి పక్క. ..  

అందులోని మొక్కల పక్క . .

మీరు ఒక లుక్కేయండి . . . ప్లీజ్ . . . 


  

Many Many 

Happy Returns Of The Day Akka. . .

@ Hema-Chandra & Family

Post a Comment

0 Comments