ఒక అమ్మాయిని ప్రేమిస్తేనే. .. మనకు ప్రేమ విలువ తెలుస్తుందా? | POETRY ON LOVE | KSR CREATIVES
ప్రేమ గురించి . . .
ఏదైనా కొత్తగా రాద్దామని . . .
మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా . . .
కానీ రాసిన ఒక్కొకటి
చదువుతుంటే నాకే
పరమ చెత్తగా అనిపిస్తున్నాయి . .
లవ్ గురించి ..
ఇంత మంది . .
ఇన్ని రకాలుగా రాస్తున్నారే . .
మరి నేనెందుకు , , ,
రాయలేక పోతున్నానబ్బా . . .
ఇదే మాట . .
నా ఫ్రెండ్ తో అంటే . .
వాడు నవ్వి . ..
నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా
లవ్ చేసావురా , , ,
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న నీకు . . .
ప్రేమ కవితలు . . ఎలా వస్తాయిరా . .అన్నాడు . .
ఇంకో ఫ్రెండ్ అయితే . . .
నీకెప్పుడైనా బ్రేక్ అప్. . .
అయ్యిందారా అన్నాడు . . .
ఒక్కసారి అయ్యుంటే . .
పేజీలకు పేజీలు కవితలు . .
రాసేవాడివి అన్నాడు . . .
నాకైతే ఏమి అర్థం
కావడం లేదు . . .
అంటే ఒక అమ్మాయిని
ప్రేమిస్తేనే. ..
మనకు ప్రేమ విలువ తెలుస్తుందా . .
మన అమ్మ పైన,
అన్న పైన, తమ్ముడి పైన . .
అక్క పైన, చెల్లి పైన ..
స్నేహితుడిపైన . .
బంధువుల పైన . ..
మనుషులందరి పైన .. .
చూపించే ప్రేమ . . .
ప్రేమ కాదా?
సారీ క్షమించండి . .
నేను ప్రేమ గురించి . .
ఇంతకంటే ఎక్కువ . .
రాయలేకపోతున్నా . .
నా ప్రశ్నలకు . . .
సమాధానం కనుక్కొని . . .
వీలైతే కొనుక్కొని . .
మళ్లీ కలుస్తా . . .
ఇట్లు ప్రేమతో . .
మీ KSR CREATIVES
0 Comments