Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

CHILIPI CHIRUGAALI SONG | DONGAATA MOVIE | KSR CREATIVES


తస్స చెక్క తద్దినక చిందెనుగా సందడిగా
చెంగుమనే రంగ రంగేళి
చెమ్మచెక్క చూడ చుక్క తుళ్ళేనుగ అల్లరిగా
కంగుమనే కుర్ర కవాళి
పాపాలు సవాలంటరా
బావలు సత్తా చూస్తరా
గోడమీద బల్లి ఏమంది పడుచు బుల్లి
పాత ప్రశ్నలెందుకన్నది


చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
జడ్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆట
ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి
కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి...
ఓ.ఓ.ఓ. మేము రెడీ
ఓ.ఓ.ఓ. కానీ మరి


చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట

కొమ్మంటు ఎరుగని పూలెన్నో ఉన్నవి వాటిని ఏవంటారు
ఏనాడు చెరగని చిరునవ్వులే అవి కాదని ఎవరంటారు

పక్కుమంటూ నవ్వి వప్పుకుంటాం
చెప్పమంటూ ఇంకో చిక్కు వేస్తాం


దేవుడికి పువ్వులిచ్చి ముల్లివ్వమంటూ అడిగేవాలెవ్వరుంటారు
పెళ్లీడు మీద పడ్డ కన్నెపిల్లలంతా ఆ మూడు ముళ్ళు కోరతారు
బాగానే సెలవిచ్చారు మీ మగవాలింకేమిస్తారు
మీ నోచే నోముల ఫలితం మేమంటారు
ఓ.ఓ.ఓ. ఎం పొగరు
ఓ.ఓ.ఓ. తగ్గిందా జోరు


చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట

ఏటిలో తను ఈతాడుతున్న తడవనే తడవదేది
నీటిలో పడు నీ నీడ కన్న ఇంక వేరేముంది

అమ్మలాల ఇట్టే చెప్పినాడే
అప్పుడేనా ఇంకావుంది చూడే


కన్నుల్ని మూసి చూస్తే కనిపించుతుంది ఆ చిత్రం ఏమిటైయుంటుంది
నీలాల కన్నుపాప నిదురించ గానే కలవచ్చి కనబడుతుంది
నీ కమ్మని కల ఏమంది ఏ కబుర్లు చెబుతూ ఉంది
ఇవ్వాలో రేపో నిజమై వస్తానంది

ఓ.ఓ.ఓ. ఇంకేమ్మరి
ఓ.ఓ.ఓ. రానీ మరి


చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి
కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి
ఓ.ఓ.ఓ. మేము రెడీ
ఓ.ఓ.ఓ. కానీ మరీ


చిలిపి చిరుగాలి - పాడాలి కొత్త పాట
ఆడాలి కొంటె ఆట - పాడాలి కొత్త పాట

Post a Comment

0 Comments